Tuesday, December 16, 2008

కొలని దోఁపరికి గొబ్బిళ్ళో యదు-


దేసాళం
కొలని దోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో. IIపల్లవిII

కొండ గొడుగుగా గోవులఁ గాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల-
గుండు గండనికి గొబ్బిళ్ళో. IIకొలనిII

పాపవిధుల శిశుపాలుని తిట్ల-
కోపగానికిని గొబ్బిళ్ళో
యేపునఁ గంసుని యిడుమలఁ బెట్టిన-
గోపబాలునికి గొబ్బిళ్ళో. IIకొలనిII

దండి వైరులను తఱమిన దనుజుల-
గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిఁ బైఁడియగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో. IIకొలనిII ౫-౯౮

2 comments:

నందు said...
This comment has been removed by the author.
నందు said...

అన్నమ్మాచార్యులవారి కీరనలని ఇలా సేకరించి ఓ చోట పొందుపరచాలన్న మీ తలంపుకి మా అభినందనలు. మరిన్ని కీర్తనలు పొందుపరచగలరు.

శెలవు

నందు