నాదరామక్రియ
నే నే మెరిఁగి సేసేనో నీకుఁ దిరువారాధన
అవి మున్నిటి బ్రహ్మరుద్రాదులు సేయఁగలేరు IIపల్లవిII
అనుగునీరూప మింతంత నెరిఁగి సేసేనో
వునికై నీ వొక్కచోనే వుండే దెరిఁగి సేసేనో
తనిసి నీకు నొక్క మంత్రమనెరిఁగి సేసేనో
కనరాని నీ మహిమే కడయెరిఁగి సేసేనో . iiనేనేii
మరిగి నీకు నొక్కనామమనెరిఁగి సేసేనో
అరసి యించుకేకాలమనెరిఁగి సేసేనో
నిరతి నీ కేమి లేవని యెరిఁగి సేసేనో
బెరసి నన్నుఁ గొంత మెప్పించ నెరిఁగి సేసేనో. iiనేనేii
తెలిసి నీకు నొక్కమూర్తియనెఱిఁగి సేసేనో
అలమిననీమాయఁ గొంత నెరిఁగి సేసేనో
అలమేల్మంగకుఁ బతియగు శ్రీ వేంకటేశుఁడ
వొలిసి నీ కపమింప నొక్క టెరిఁగి సేసేనో. iiనేనేii 2-373
Thursday, June 3, 2010
Tuesday, June 1, 2010
సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి
సాళంగనాట
సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి
గతలాయ నడురేయిఁ గలిగె శ్రీకృష్ణుఁడు iiపల్లవిii
పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుఁడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాఁ డీ కృష్ణుఁడు. iiసతుii
వచ్చి బ్రహ్మయు రుద్రుఁడు వాకిట నుతించఁగాను
యిచ్చగించి వినుచున్నాఁ డీ కృష్ణుఁడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చిన మహిమలతో యీ కృష్ణుఁడు. iiసతుii
కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డఁడాయ నీకృష్ణుఁడు
అదన శ్రీ వేంకటేశుఁడై యలమేల్మంగఁగూడి
యెదుటనే నిలుచున్నాఁ డీకృష్ణుఁడు. iiసతుii 14-453
Monday, March 15, 2010
రాముఁడు లోకాభిరాముఁ డందరికి రక్షకుఁ డీతనిఁ దెలిసి కొలువరో
నాట
రాముఁడు లోకాభిరాముఁ డందరికి రక్షకుఁ డీతనిఁ దెలిసి కొలువరో
కామితఫలదుఁడు చరాచరములకుఁ గర్తయైన సర్వేశ్వరుఁడితఁడు II పల్లవిII
తలఁప దశరథతనయుఁడట తానె తారకబ్రహ్మమట
వెలయ మానుషపు వేషమట వెగటుగ హరువిల్లు విరిచెనట
అలరఁగ తానొక రాజట పాదాన నహల్యశాపము మాన్చెనట
సొలవక దైవికమానుషలీలలు చూపుచు మెరసీఁ జూఁడరో యితఁడు . II రాముII
జగతి వసిష్ఠునిశిష్యుఁడట జటాయువుకు మోక్ష మిచ్చెనట
అగచరులే తనసేనలట అంబుధి కొండలఁ గట్టెనట
మగువకొరకుఁగానట కమలాసను మనుమనిఁ రావణుఁ జంపెనట
తగ లౌకికి వైదికములునొక్కట తానొనరించీఁ జూడరో యితఁడు . II రాముII
వెస నమరుల వరమడిగెనట విభీషణపట్టము గట్టెనట
యెసగ నయోధ్యకు నేలికట యింద్రాదులకుఁ గొలువిచ్చెనట
పొసగ శ్రీవేంకటగిరి నివాసమట భువనము లుదరంబున ధరించెనట
సుసరపుసూక్ష్మాధికములు తనందుఁ జూపుచునున్నాఁడు చూడరో యితఁడు. II రాముII 4-277
Friday, March 12, 2010
దినము ద్వాదశి నేఁడు తీర్థదివసము నీకు
|
శ్రీరాగం
దినము ద్వాదశి నేఁడు తీర్థదివసము నీకు
జనకుఁడ అన్నమాచార్యుఁ డ విచ్చేయవే IIపల్లవిII
అనంత గరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుఁడైన దైవశిఖామణి తోడ
వెనుకొని యారగించ విచ్చేయవే. IIదినముII
వైకుంఠాన నుండి యాళువారల లోపల నుండి
లోకపు నిత్య ముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీ వేంకటేశుఁ గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే. IIదినముII
సంకీర్తనముతోడ సనకాదులెల్లఁ బాడ
పొంకపు శ్రీ వేంకటాద్రి భూమినుండి
లంకె శ్రీ వేంకటగిరి లక్ష్మీవిభుఁడు నీవు-
నంకెల మాయింటివిందు లారగించవే. IIదినముII 2-151
Thursday, August 13, 2009
శ్రావణబహుళాష్టమి సవరేత్రికాడను శ్రీవిభుఁడుదయించెఁ జెలులాల వినరే
మాళవశ్రీ
శ్రావణబహుళాష్టమి సవరేత్రికాడను
శ్రీవిభుఁడుదయించెఁ జెలులాల వినరే. IIపల్లవిII
అసురుల శిక్షించ నమరుల రక్షించ
వసుధభారమెల్లా నివారింపను
వసుదేవునికిని దేవకీదేవికిని
అసదృశమగు కృష్ణుఁ డవతారమందెను. IIశ్రావణII
గోపికలమన్నించ గొల్లలనెల్లాఁ గావఁగ
దాపై మునులనెల్లా దయసేయను
దీపించ నందునికి దేవియైనయశోదకు
యేపున సుతుఁడై కృష్ణుఁడిన్నిటాఁ బెరిగెను IIశ్రావణII
పాండవుల మనుపఁగ పదారువేలఁ బెండ్లాడఁగ
నిండి శ్రీవేంకటాద్రిపై నిలుచుండఁగా
అండ నలమేల్మంగ నక్కునఁ గాఁగిలించఁగ
దండియైయుండఁ గృష్ణుఁడు తగ నుతికెక్కెను. IIశ్రావణII ౪-౨౮౭
శ్రావణబహుళాష్టమి సవరేత్రికాడను
శ్రీవిభుఁడుదయించెఁ జెలులాల వినరే. IIపల్లవిII
అసురుల శిక్షించ నమరుల రక్షించ
వసుధభారమెల్లా నివారింపను
వసుదేవునికిని దేవకీదేవికిని
అసదృశమగు కృష్ణుఁ డవతారమందెను. IIశ్రావణII
గోపికలమన్నించ గొల్లలనెల్లాఁ గావఁగ
దాపై మునులనెల్లా దయసేయను
దీపించ నందునికి దేవియైనయశోదకు
యేపున సుతుఁడై కృష్ణుఁడిన్నిటాఁ బెరిగెను IIశ్రావణII
పాండవుల మనుపఁగ పదారువేలఁ బెండ్లాడఁగ
నిండి శ్రీవేంకటాద్రిపై నిలుచుండఁగా
అండ నలమేల్మంగ నక్కునఁ గాఁగిలించఁగ
దండియైయుండఁ గృష్ణుఁడు తగ నుతికెక్కెను. IIశ్రావణII ౪-౨౮౭
Subscribe to:
Posts (Atom)