నాదరామక్రియ
నే నే మెరిఁగి సేసేనో నీకుఁ దిరువారాధన
అవి మున్నిటి బ్రహ్మరుద్రాదులు సేయఁగలేరు IIపల్లవిII
అనుగునీరూప మింతంత నెరిఁగి సేసేనో
వునికై నీ వొక్కచోనే వుండే దెరిఁగి సేసేనో
తనిసి నీకు నొక్క మంత్రమనెరిఁగి సేసేనో
కనరాని నీ మహిమే కడయెరిఁగి సేసేనో . iiనేనేii
మరిగి నీకు నొక్కనామమనెరిఁగి సేసేనో
అరసి యించుకేకాలమనెరిఁగి సేసేనో
నిరతి నీ కేమి లేవని యెరిఁగి సేసేనో
బెరసి నన్నుఁ గొంత మెప్పించ నెరిఁగి సేసేనో. iiనేనేii
తెలిసి నీకు నొక్కమూర్తియనెఱిఁగి సేసేనో
అలమిననీమాయఁ గొంత నెరిఁగి సేసేనో
అలమేల్మంగకుఁ బతియగు శ్రీ వేంకటేశుఁడ
వొలిసి నీ కపమింప నొక్క టెరిఁగి సేసేనో. iiనేనేii 2-373
Thursday, June 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
వెంకన్న సేవ కి Whatsapp
https://www.youtube.com/watch?v=X9cAkbSfr0k&feature=youtu.be
Post a Comment