Thursday, August 13, 2009

శ్రావణబహుళాష్టమి సవరేత్రికాడను శ్రీవిభుఁడుదయించెఁ జెలులాల వినరే

మాళవశ్రీ
శ్రావణబహుళాష్టమి సవరేత్రికాడను
శ్రీవిభుఁడుదయించెఁ జెలులాల వినరే. IIపల్లవిII


అసురుల శిక్షించ నమరుల రక్షించ

వసుధభారమెల్లా నివారింపను

వసుదేవునికిని దేవకీదేవికిని

అసదృశమగు కృష్ణుఁ డవతారమందెను. IIశ్రావణII


గోపికలమన్నించ గొల్లలనెల్లాఁ గావఁగ

దాపై మునులనెల్లా దయసేయను

దీపించ నందునికి దేవియైనయశోదకు

యేపున సుతుఁడై కృష్ణుఁడిన్నిటాఁ బెరిగెను IIశ్రావణII


పాండవుల మనుపఁగ పదారువేలఁ బెండ్లాడఁగ

నిండి శ్రీవేంకటాద్రిపై నిలుచుండఁగా

అండ నలమేల్మంగ నక్కునఁ గాఁగిలించఁగ

దండియైయుండఁ గృష్ణుఁడు తగ నుతికెక్కెను. IIశ్రావణII ౪-౨౮౭

No comments: