Monday, February 23, 2009

రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా

శ్లో!!
రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా
సౌమిత్రి భరతశత్రుఘ్నులతోడ జయమందు దశరథరాఘవా. IIపల్లవిII

శిరసు కూఁకటుల రాఘవా చిన్నారిపొన్నారి రాఘవా
గరిమ నావయసున తాటకిఁ జంపిన కౌసల్యనందన రాఘవా
అరిది యజ్ఞముగాచి రాఘవా యట్టె హరునివిల్లు విరిచిన రాఘవా
సిరులతో జనకునియింట జానకిఁ జెలఁగి పెండ్లాడిన రాఘవా. IIరామII

మలయు నయోధ్యారాఘవా మాయామృగాంతక రాఘవా
చెలఁగి చుప్పనాతిగర్వ మడఁచి దైత్యసేనలఁ జంపిన రాఘవా
సొలసి వాలిఁజంపి రాఘవా దండి సుగ్రీవునేలిన రాఘవా
జలధిబంధించినరాఘవా లంకసంహరించిన రాఘవా. IIరామII

దేవతలుచూడ రాఘవా దేవేంద్రురథమెక్కి రాఘవా
రావణాదులనుఁజంపి విభీషణు రాజ్యమేలించిన రాఘవా
వేవేగ మరలి రాఘవా వచ్చి విజయపట్టమేలి రాఘవా
శ్రీవేంకటగిరిమీఁద నభయములు చెలఁగి మాకిచ్చిన రాఘవా. IIరామII౧౦-౧

No comments: