|
కేదారగౌళ
సువ్వి సువ్వి సువ్వని
సుదతులు దంచెదరో లాల. IIపల్లవిII
వనితల మనసులు కుందెన చేసిటు
వలపులు తగ నించో లాల
కనుసన్నలనెడు రోఁకండ్లను
కన్నెలు దంచెదరోలాల. IIసువ్విII
బంగారు చెరఁగుల పట్టుపుట్టముల-
కొంగులు దూలఁగ నోలాల
అంగనలందరు నతివేడుకతో
సంగడి దంచెదరోలాల. IIసువ్విII
కురులు దూలఁగ మంచి గుబ్బచన్నులపై
సరులు దూలాడఁగ నోలాల
అరవిరి బాగుల నతివలు ముద్దులు
గురియుచు దంచెదరోలాల. IIసువ్విII
ఘల్లు ఘల్లుమని(ను?)కంకణరవములు(ల?)
పల్లవ పాణుల కో(నో?)లాల
అల్లన నడుములు అసియాడుచు సతు-
లొల్లనె దంచెదరోలాల. IIసువ్విII
కప్పుర గందులు కమ్మని పువ్వుల-
చప్పరములలో నోలాల
తెప్పలుగా రతిఁ దేలుచుఁ గోనే-
టప్పనిఁ బాడెదరోలాల. IIసువ్విII ౫-౩౫౩
No comments:
Post a Comment