లలిత
చేరి నీ వేడుకలెల్లాఁ జెల్లీఁ గాని
తారుకాణలయ్యీ యేకతానకు రారాదా. IIపల్లవిII
అచ్చలాన నీవు నన్ను నడిగేవు మాటలెల్లా
రచ్చలోనఁ జెప్పుదురా రామలసుద్ది
కచ్చువెట్టి మోహ మంతగలవాఁడ వైతేను
తచ్చి నీవు వేచి యేకతానకు రారాదా. IIచేరిII
పిలిచి సన్న చేసేవు ప్రియురాలిరాకకు
కొలువులోకిఁ దెత్తురా కోమలిని
కలయఁగ నీ కిప్పుడు కడు వేడుకైతేను
తలకొని యిట్టె యేకతానకు రారాదా. IIచేరిII
చెక్కు నొక్కి వేఁడుకొని చెలియఁ జూపు మనేవు
పక్కఁ దెచ్చి పెట్టుదురా పడఁతులను
యిక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
దక్కితివి యిట్టె యేకతానకు రారాదా. IIచేరిII ౧౬-౩
Monday, December 8, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment