Friday, July 18, 2008

ఎటువంటి బిడ్డండె యితఁడు

ఆహిరి
ఎటువంటి బిడ్డండె యితఁడు
ఇటువంటి వయసుననె యిట్లఁజేసీని IIపల్లవిII

నడుఁక కెటు నీటిలోననె యీఁదులాడీని (మత్స్యావతారం)
తడవి పట్టెదమన్న దాఁగి పోయీని (కూర్మావతారం)
తడఁబడక నేలగుంతలువోవ దవ్వీని (వరాహవతారం)
కడపమీఁదనె వుండి కదలఁడెప్పుఁడును। (నరసింహావతారం) IIఎటుII

కలిమిలే మెఱుంగఁడిదె కల వెల్ల నడిగీని (వామనావతారం)
చలమ రెవ్వరినైనఁ జావ నడిచీని ( పరశురామావతారం)
అలయ కడవులవెంట నాటలకే తిరిగీని (రామావతారం)
తొలఁగకిటు గిరులెక్కి దుముకు లాడీని। (కృష్ణావతారం) IIఎటుII

విచ్చన విడినె తడువు విడిచి పారీని (బుద్ధావతారం)
రచ్చలనె యింత గుఱ్ఱము వంటి కొడుకు (కల్క్యావతారం)
దిచ్చరీడై యిట్లు దిరువెంకటేశ్వరుండు
నిచ్చ నిచ్చలును గడుఁబెచ్చు వెరిగీని। IIఎటుII ౬-౬౨

దశావతార వర్ణన।
నడుఁక=వడఁకు,కంపించు
తడువు=?
దిచ్చరీడు=?

No comments: